ఆరు కండ్ల మంత్రులు చేసిన అభివృద్ధి ఏమిటో?.. పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంజిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు, ఆరు కండ్లు ఉన్నవారు చేయలేనిది తాను ఒక్కడినే చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
- వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నా..
- మేడిగడ్డలో నీళ్లు వదిలినా భద్రాచలానికి ప్రమాదంలేదు
ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంజిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు, ఆరు కండ్లు ఉన్నవారు చేయలేనిది తాను ఒక్కడినే చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ‘రైతు ఆశీర్వాద సభ’లో సీఎంరేవంత్‌రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చె ప్పారు. రాష్ట్ర రైతులు, ప్రజలకు ఏవిధమైన ప్రయోజనం చేకూరుస్తారో చెప్పకుండా, బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా దూషించడానికే సీఎం పరిమితం కావడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
రెండున్నర ఏండ్లలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేసిన అభివృద్ధి కన్నా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.వేల కోట్లతో ఖమ్మంజిల్లా చరిత్రలో ఎవరూ చేయలేని అభివృద్ధిని చేసి చూపించానని గుర్తుచేశారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోదని చెప్పారు. హరీశ్‌రావు బీజేపీ తో మంతనాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్న సీఎం.. దమ్ముంటే నిఘా విభాగంతో విచారణ జరిపించి ఎవరితో మాట్లాడారో తేల్చాలని సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టును ఖమ్మం వరప్రదాయినిగా మార్చే శక్తి బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

