హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తిం పు ప్రక్రియను తక్షణం చేపట్టాలని భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ డి మాండ్ చేశారు. తెలంగాణ కౌలు రైతు ల గుర్తింపు సాధన కమిటీ ప్రతినిధులు విస్సా కిరణ్కుమార్, బీ కొండల్, కన్నెగంటి రవి బృందంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సోమవారం ఆయన కలిశారు. కౌలు రైతుల ఇబ్బందులను వివరించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడిచినా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. రైతులకు గుర్తింపును మొదలుపెట్టి సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారని యోగేంద్రయాదవ్ వెల్లడించారు.