రెగ్యులర్ పోస్టుల భర్తీ ఎప్పుడో?
రాష్ట్రంలో టీచర్ పోస్టులే కాదు.. టీచర్లను తయారుచేసే ప్రభుత్వ డైట్ కాలేజీలు, బీఈడీ కళాశాలల్లోనూ ఫ్యాకల్టీ పోస్టులు ఎన్నో ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో విద్యారంగానికి దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైతం నిర్వీర్యమవుతున్నది. ఈ సంస్థలోనూ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఎన్నో ఏండ్లుగా ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఖాళీ
- విద్యకు దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైతం నిర్వీర్యం
- అదే బాటలో ప్రభుత్వ డీఎడ్, బీఈడీ కళాశాలలు సైతం..
- ఇంతకాలం అతిథి ఫ్యాకల్టీతోనే..
- ఎట్టకేలకు డిప్యుటేషన్‌పై భర్తీ
- ఆగస్టు 10లోగా అర్హులైన టీచర్లను నియమించే అవకాశం
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టులే కాదు.. టీచర్లను తయారుచేసే ప్రభుత్వ డైట్ కాలేజీలు, బీఈడీ కళాశాలల్లోనూ ఫ్యాకల్టీ పోస్టులు ఎన్నో ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో విద్యారంగానికి దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైతం నిర్వీర్యమవుతున్నది. ఈ సంస్థలోనూ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యా పరిశోధన-శిక్షణలో అత్యంత కీలకమైన ఈ సంస్థలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎందరున్నారంటే, వేళ్లపై లెక్కబెట్టేంత మంది మాత్రమే. రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్ కాలేజీలుండగా, 286 పోస్టులకు పట్టుమని 10 మంది కూడా లేకపోవడం గమనార్హం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం డైట్ కాలేజీల్లో 50 సీట్లుంటే 8మంది, 100 సీట్లున్న కాలేజీలో 16, 150 సీట్లున్న కాలేజీలో 24 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. కానీ, ఇంతకాలం గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొచ్చారు. ఇప్పుడు డిప్యుటేషన్‌పై అర్హులైన టీచర్లను వినియోగించుకోనున్నారు.
ఎస్సీఈఆర్టీలో 18, బీఈడీ కాలేజీల్లో 36..
పాఠశాల విద్యకు మార్గదర్శకత్వం వహించే రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు ప్రొఫెసర్ పోస్టులతోపాటు 13 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ఇవే కాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ ఆన్‌డ్యూటీలు, ఇన్చార్జులతో నెట్టుకొచ్చారు. తాజాగా మొత్తం 18 పోస్టులను డిప్యుటేషన్/ఫారిన్ సర్వీస్‌లో భర్తీచేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. ఇవేకాకుండా ప్రభుత్వ బీఈడీ కాలేజీల్లోనూ వందల సంఖ్యలో ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, నాగార్జునసాగర్‌లోని కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లలో 12 చొప్పున మొత్తం 36 మంది లెక్చరర్ల కొరత వేధిస్తున్నది.
డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్ ద్వారా భర్తీ..
డైట్, బీఈడీ కాలేజీలు, ఎస్సీఈఆర్టీలోని ఖాళీ పోస్టులను డిప్యుటేషన్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్ ప్రాతిపదికన భర్తీచేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డైట్ కాలేజీల్లో 131, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో 36, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్‌లో 17, ఎస్సీఈఆర్టీలో 18 పోస్టుల చొప్పున 202 పోస్టులను భర్తీచేయనున్నది. సర్కార్ బడుల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూలై 4 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూలై 25 నుంచి 31 వరకు రాత పరీక్షలు, ఆగస్టు 6, 8 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన టీచర్లకు ఆగస్టు 10న డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీచేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

