హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, నటుడు చిరంజీవి, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలియజేశారు.
అభినందనలు తెలిపినవారిలో టీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్‌గౌడ్, హన్మంత్ నాయక్, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరాందాస్ యాదగిరి తదితరులు ఉన్నారు.