గొర్రెల యూనిట్ ధర పెంపు?
- బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలు
- త్వరలోనే సీఎం దృష్టికి సమస్య
- ఆమోదం లభిస్తే కొత్త రేట్లు ఖరారు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లక్షల మంది గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపింది. సాఫీగా సాగిన ఈ పథకానికి ఇప్పుడు ధరల రూపంలో చిన్న సమస్య ఎదురైంది. ధరలు పెరగటంతో ప్రస్తుత ధరలో యూనిట్ గొర్రెలను కొనుగోలు చేయడం అధికాలకు కష్టంగా మారుతున్నది. డీలర్లు సైతం ప్రస్తుతం ఉన్న (రూ.1.25 లక్షలు) ధరకు 21 గొర్రెలను పంపిణీ చేసేందుకు ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలో యూనిట్ ధరను పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ సమస్యను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లిన అధికారులు.. త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. యూనిట్ ధర పెంపునకు సీఎం ఆమోదం తెలిపితే రెండో విడుత గొర్రెల పంపిణీకి కొత్త రేట్లను ఖరారు చేయనున్నారు. యూనిట్ ధరను రూ.1.40 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉన్నది. అటు.. రెండో విడుత గొర్రెల పంపిణీని జూలై చివరి నుంచి ప్రారంభించేందుకు పశు సంవర్థకశాఖ కసరత్తు చేస్తున్నది. మొదటి విడుతలో ఇప్పటికే 3,66,373 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తికాగా 28,335 మందికి పంపిణీ కొనసాగుతున్నది. రెండో విడుతలో 3,36,864 మందికి గొర్రెల పంపిణీ చేయాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- sheep
- sheep unit
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

