పోస్టు స్మిత వ్యక్తిగతమా.. ప్రభుత్వ ఆలోచనా?
‘దివ్యాంగులు ఎయిర్‌లైన్స్‌లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుకు ఆమె ఎవరు?’ అని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాల లత ప్రశ్నించారు.
- రేవంత్‌రెడ్డి సర్కారు స్పష్టతనివ్వాలి
- ఎవరిని తీసుకోవాలో చెప్పే అధికారం ఆమెకెక్కడిది?
- ఉద్యోగంలో ఎన్నిసార్లు పరుగెత్తి పనిచేసినవ్?
- దివ్యాంగులకు స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలి
- కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెపై చర్యలు తీసుకోవాలి
- సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాల లత
ఖైరతాబాద్, జూలై 22 : ‘దివ్యాంగులు ఎయిర్‌లైన్స్‌లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుకు ఆమె ఎవరు?’ అని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాల లత ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఓ ఐఏఎస్ అధికారి స్థాయిలో వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ప్రభుత్వ ఆలోచనగా చెప్పారా? అని నిలదీశారు. ఒక వేళ ప్రభుత్వం తరఫున చెప్పాలనుకుంటే కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించారా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. కొందరు సివిల్ సర్వీస్ ఉద్యోగులు తమ ఐడెంటిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకమని చెప్పారు.
ఆమె వ్యాఖ్యలు యావత్ దేశంలోని దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దివ్యాంగ సమాజాన్నే అవమానపర్చే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు దివ్యాంగులు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు ఫిజికల్‌గా ఫిట్నెస్ కావాలా? లేక మెంటల్గానా అన్నది స్పష్టం చేయాలని, ఆమె ఉద్యోగంలో ఎన్ని సార్లు పరుగెత్తి పనిచేశారు?, ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ చేశారో చెప్పాలని నిలదీశారు. సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఓ దివ్యాంగురాలికి ఇచ్చారని, ఆమెకు అర్హత ఉందా? లేదా? చూసుకొని ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి
2016 దివ్యాంగుల చట్టం ప్రకారం దివ్యాంగుల గురించి ఇలా రాయడం నేరమని, ఆమెపై కండక్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ కింద చర్యలు తీసుకోవాలని బాల లత డిమాండ్ చేశారు. దివంగత మంత్రి జైపాల్‌రెడ్డి సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారని గుర్తుచేశారు. జైపాల్‌రెడ్డి తన గురువు అని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎవరూ దివ్యాంగ సర్టిఫికెట్తో ఉద్యోగాలు తెచ్చుకోలేదని, యూపీపీఎస్సీలో తనకు వచ్చిన మార్క్స్షీట్స్ చూపిస్తానని చెప్పారు. ఐఏఎస్‌లు కావాలంటే అందగత్తెలు, ఐపీఎస్‌లు కావాలంటే జిమ్ట్రైన్డ్స్ సరిపోతారా? అని ప్రశ్నించారు.
స్మితా సబర్వాల్ శారీరకంగా ఫిట్‌గా ఉన్నా ఆమెకు మానసిక స్థితి బాగాలేదని తెలుస్తున్నదని చెప్పారు. స్మితా సబర్వాల్ తన పోస్టుకు రాజీనామా చేసి వస్తే ఇద్దరం కలిసి మళ్లీ సివిల్స్ రాద్దామని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని, దివ్యాంగులతో కలిసి పరీక్ష రాయాలని సవాల్ చేశారు. 24 గంటల్లో ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, దివ్యాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. లేదంటే జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

