సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సీఎం కేసీఆర్ | కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

హైదరాబాద్ : కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయాల అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో అర్చకులు, ఆలయ సిబ్బంది కలిసి సుదర్శన హోమం నిర్వహించారు. ఏడు పాయల వన దుర్గాభవాని మాతా ఆలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే రవిశంకర్, మల్యాల, కోడీమ్యాల మండల నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బషీర్ బాగ్ కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ హోమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Coronavirus
- Prayers
- Yadari
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

