హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అమెరికాలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికైంది.అసోసియేషన్ చైర్మన్‌గా ప్రవీణ్‌రెడ్డి కేసిరెడ్డి, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్‌గా బాపురెడ్డి కేతిరెడ్డి, కార్యదర్శిగా ప్రవీణ్ సిగిరికొండ, కోశాధికారిగా సుధీర్ ముద్దసాని, బోర్డు ఆఫ్ ట్రస్టీగా సంతోష్‌రెడ్డి కాకులవరం, ఉపాధ్యక్షులుగా శ్రవణ్ పదూర్, మధు న్యాలపట్ల, సక్రు వాంకుడోతు, ప్రవీణ్బిల్లా, కిరణ్ బద్దం, రవీందర్ గడ్డంపల్లి, అమర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా దుష్యంత్‌రెడ్డి, విజయ్ సద్వుతో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేయాలనే మహోన్నత ఆశయంతో ఈ అసోసియేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే.