మంత్రి వేములకు మాతృవియోగం
మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో శుక్రవారం జరిగే అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానున్నారు.
- సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
- నేడు వేల్పూర్‌లో అంత్యక్రియలు
- హాజరుకానున్న ముఖ్యమంత్రి
నిజామాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ వేల్పూర్: రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి సతీమణి మంజులమ్మకు గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్న ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తూ వచ్చింది. కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె గురువారం పరిస్థితి విషమించడంతో మరణించారు.

సీఎం కేసీఆర్ సంతాపం..
మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో శుక్రవారం జరిగే అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో వేల్పూర్‌కు చేరుకోనున్నారు.
కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మంజులమ్మ మృతికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సీహెచ్ మదన్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచారి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మధుశేఖర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రి తదితరులు మంత్రి వేములను కలిసి ఓదార్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

