ర్యాట్లో పాజిటివ్.. ఆర్టీపీసీఆర్లో నెగెటివ్!

అయినా లక్షణాలుంటే జాగ్రత్త
వైద్య నిపుణులు సూచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్) చేయించుకున్నారు. మిత్రుడి సలహా మేరకు మరోచోటకు వెళ్లి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ర్యాట్లో పాజిటివ్ రాగా, ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక వైద్యుల వద్దకు పరుగుపెట్టారు. ఇలాంటి ఉదాహరణలు సెకండ్ వేవ్‌లో చాలా ఎదురవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. నిజానికి లక్షణాలు లేనివారికి ర్యాట్ చేయిస్తే నెగెటివ్ వస్తుంది. ఇలాంటి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ర్యాట్లో పాజిటివ్ వస్తే కొందరికి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వస్తున్నది. ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని నిర్దిష్ట లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పితోపాటు ఎక్కువ మందిలో డయేరియా వస్తున్నదని, ఇలాంటి లక్షణాలు గుర్తించాలని చెప్తున్నారు. పాజిటివ్ లేదా నెగెటివ్ రిపోర్టుతో సంబంధం లేకుండా, బాధితులు జాగ్రత్త పడాలని, లక్షణాలుంటే వెంటనే వేరుగా ఉండటం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆక్సిజన్ లెవల్ తగ్గితే..
జ్వరం, దగ్గు, జలుబుకుతోడు ఏ ఇతర లక్షణాలున్నా కరోనా అనుకొని జాగ్రత్త పడాలి. ఏ లక్షణం ఉంటే దానికి మందులు వాడాలి. శ్వాస సమస్యలు ఎదురైతే వెంటనే అప్రమత్తం కావాలి. ఆక్సిజన్ లెవల్ 93 కంటే తక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి. మార్కెట్లో నాణ్యతలేని కొన్ని యాంటిజన్ టెస్టు కిట్ల వల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. తొలుత నెగెటివ్, ఆ వెంటనే పాజిటివ్ రావడం అనేది సెకండ్ వేవ్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతున్నదో అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
- డాక్టర్ రంగారెడ్డి బుర్రి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- oxygen levels
- rapid
- rtpcr
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

