పూసల కులస్థులు ఎంబీసీలో ఉంటారు

- 100% రాయితీతో పథకం.. ఈ కులాన్ని ఎంబీసీలో చేర్చుతాం
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హామీ
హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): సాధ్యమైనంత త్వరలో పూసల సామాజికవర్గం కోసం ప్రత్యేక రాయితీలతో ప్రభుత్వం పథకం తెస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ హామీఇచ్చారు. కొన్ని కులాలను సాంకేతిక సమస్యల వల్ల ఎంబీసీలో చేర్చలేదని, పూసల కులస్థులు తప్పకుండా ఎంబీసీలో ఉంటారని స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర పూసల సంఘం ప్రతినిధి బృందంతో బోయినపల్లి వినోద్‌కుమార్ మంత్రుల నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణలో అణగారిన జాతుల్లో ఒకటైన పూసల కులస్థుల స్థితిగతులపై ఇటీవల క్యాబినెట్లో చర్చ జరిగిందని వినోద్‌కుమార్ తెలిపారు. పూసల కులానికి చెందిన తల్లులు నెత్తిన గంప పెట్టుకుని గాజులు, అద్దాలు వంటి అలంకార వస్తువులను అమ్ముకుంటారని, వివిధ గృహోపకరణ వస్తువులను కూడా వాయిదాల పద్దతిలో ఇచ్చి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారని, బ్యాంకర్లతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం రాయితీతో ప్రత్యేక పథకం ప్రకటించే యోచనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని తెలిపారు. వినోద్‌కుమార్‌ను కలిసినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుంటిపల్లి వెంకట్, గుండ్లపల్లి సత్యనారాయణ, కోశాధికారి కావేటి దిలీప్, రాష్ట్ర నేతలు పొదిలి వెంకటరమణ, చేని వెంకన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- mbc
- pusala cast
- vinod kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

