ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆదివారంతో ముగిసిందని ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. సాయంత్రం 5 గంటల్లోపు బూత్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్నవారికి రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆదివారంతో ముగిసిందని ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. సాయంత్రం 5 గంటల్లోపు బూత్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్నవారికి రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. విజయవాడ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు తారుమారు కావడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ముగిసినందున బ్యాలెట్ బాక్సుల తరలింపునకు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు ఫలితాలు మంగళవారం వెల్లడిస్తామని ఈసీ తెలిపారు. పులివెందులలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌లోకి వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి కారు ప్రవేశించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు సర్కార్ ఖూనీ చేస్తున్నదని జగన్ ఆరోపించారు. పులివెందులలో 80 బూత్‌ల్లో 70 చోట్ల వైసీసీ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఓటు వేయకుండానే వెనుతిరిగి వెళ్లారు.
బ్యాలెట్ పేపర్ల తారుమారు..
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీ 7వ వార్డులో బీజేపీ గుర్తు, 3వ వార్డులో టీడీపీ గుర్తు బ్యాలెట్పేపర్లలో కనిపించలేదు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు మారాయని గుర్తించిన ఓటర్లు అధికారులను నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలింగ్ సామగ్రిని జతపరిచే సమయంలో పొరపాటు జరిగిందని తెలిపారు. 3వ వార్డుకు వెళ్లాల్సిన బ్యాలెట్ పేపర్లు 7వ వార్డుకు, 7వ వార్డుకు వెళ్లాల్సిన బ్యాలెట్ పేపర్లు 3వ వార్డుకు చేరినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

