e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్

చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్

చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం కల్పిస్తామ‌ని.. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే శుభ‌వార్త అందిస్తాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. చేనేత‌ల అభివృద్ధి కోసం చాలా చేశాం.. కానీ స‌రిపోవ‌డం లేదు.. చేనేత వ‌ర్గం స‌మున్నతంగా బ‌తికేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. చేనేత‌ల బాధ‌ల‌ను విముక్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

ర‌మ‌ణ‌కు మంచి రాజ‌కీయ భ‌విష్య‌త్‌

రాష్ర్ట అభివృద్ధికి త‌న వంతు స‌హ‌కారానికి ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిబ‌ద్ధ‌త గ‌ల వ్య‌క్తి పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ర‌మ‌ణ‌కు మంచి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌న్నారు. టీఆర్ఎస్‌లో చేనేత వ‌ర్గానికి త‌గిన ప్రాతినిధ్యం లేద‌న్న లోటు ర‌మ‌ణ చేరిక‌తో తీరింద‌న్నారు. చేనేత సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చేనేత కార్మికుల‌కు రైతు బీమా కోసం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. ఒక‌ట్రెండు నెల‌ల్లో చేనేత‌ల‌కు బీమా వ‌ర్తిస్తుంద‌ని సీఎం తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూర‌త్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల‌పై సూర‌త్‌కు అధికారులు పంపామ‌ని గుర్తు చేశారు. రాష్ర్టంలో జౌళి ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తే తిరిగి వ‌స్తామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్‌లో వెయ్యి ఎక‌రాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు వ‌స్తున్నారు. ఒక పారిశ్రామిక‌వేత్త 3 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపారు అని సీఎం గుర్తు చేశారు.

ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీటి పారుద‌ల రంగంలో నేర‌పూరిత నిర్ల‌క్ష్యంతో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని సీఎం గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో రాష్ర్ట ఏర్పాటు కంటే ఆరు నెల‌ల ముందే తెలంగాణ పున‌ర్నిర్మాణం గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్, ఆర్ విద్యాసాగ‌ర్ రావు స‌మ‌క్షంలో మిష‌న్ కాక‌తీయ వంటి ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. ఇప్పుడు ఈ ప‌థ‌కం అద్భుతంగా అమ‌ల‌వుతుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌తి గ్రామంలో ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలో ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ర్టాన్ని గాడిలో పెట్టాల‌ని ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు. చిన్న త‌ప్పు దొర్లితే కొన్ని త‌రాల‌కు దెబ్బ‌కొడుతుంది. అందుక‌నే అజెండా ప్ర‌కారం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించి ముందుకెళ్తున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌కు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్‌

తెలంగాణ ఏర్పాటు అయితే ధ‌నిక రాష్ర్టంగా మారుతామ‌ని రాష్ర్టం ఏర్పడ‌క ముందే చెప్పాన‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ జీతాలు ఇస్తామ‌ని చెప్పాం. అది జ‌రుగుతుంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారు. నిన్న 40 ఎక‌రాలు అమ్మితే రూ. 2 వేల కోట్లు వ‌చ్చాయి. ఇలా వ‌చ్చిన ప్ర‌జా ధ‌నాన్ని ప్ర‌జ‌ల సంక్షేమం కోసమే వినియోగిస్తామ‌ని తేల్చిచెప్పారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్ర‌స్థానంలో ఉంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత భూ వివాదాలు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు. తాను ఏ తెలంగాణ‌ను కోరుకున్నానో.. అది ఆవిష్క‌రించి తీరుతాన‌ని, రాబోయే రోజుల్లో తెలంగాణ‌కు ఉజ్వ‌లమైన భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్
చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్
చేనేత వ‌ర్గానికి రాజ‌కీయ ప్రాతినిథ్యం : సీఎం కేసీఆర్

ట్రెండింగ్‌

Advertisement