పేకాటలో పట్టుబడిన రాజకీయ ప్రముఖులు
వరంగల్ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ ప్రముఖులు పట్టుబడిన ఘటన మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగు చూసింది.
- మాజీ ఎమ్మెల్యేతో పాటు, మాజీ కార్పొరేటర్లు అరెస్టు
వరంగల్‌చౌరస్తా, అక్టోబర్19: వరంగల్ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ ప్రముఖులు పట్టుబడిన ఘటన మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగు చూసింది. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాటశిబిరం కొనసాగుతున్నట్టు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన గూడూరు హరిబాబు, కాజీపేటకు చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, మామునూరుకు చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేటకు చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్ జావీద్, కొత్తవాడకు చెందిన నీలం రాజ్‌కిశోర్ (తెలంగాణ ఉద్యమకారుడు), రామన్నపేటకు చెందిన పరిశల నాగరాజు, పోచమ్మమైదాన్‌కు చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, చింతం సంతోష్, సంగెం మండలం నల్లబెల్లికి చెందిన మేరు వీరేశం ఉన్నట్టు తెలిపారు.
వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్ఫోన్లు, పేకాట కార్డులు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. చింతం సంతోష్ గతంలో పేకాట శిబిరాలు నిర్వహించి, అధిక వడ్డీకి నగదు లావాదేవీలు కొనసాగించినట్టు ఆరోపణలున్నాయి. వీరిని మట్టెవాడ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

