పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి : డీఐజీ రంగనాథ్

నల్లగొండ : పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో శనివారం నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలను వారికి వివరించారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఎక్కడ సమస్య తలెత్తినా నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 130 పోలింగ్ కేంద్రాలను 22 రూట్లుగా విభజించి 1,135 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓ ఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు అదనపు ఎస్పీలు, అయిదుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 56 మంది ఎస్ఐలు, 124 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, 564 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతోపాటు 126 మంది ఏఆర్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని డీఐజీ రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

