Betting App promotions | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు
Betting App promotions | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి.
Betting App promotions | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్‌లపై బీఎన్ఎస్ 318(4) 3, 3ఏ, టీఎస్జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోరాటం జరుగుతున్నది. దీనికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్ సైతం మద్దతు పలికారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిని అన్‌ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలువురు బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేసిన వారంతా.. ఇప్పుడు తమ వీడియోలను తొలగిస్తున్నారు. తాము తెలియక తప్పులు చేశామని.. మరోసారి అలాంటి తప్పులు చేయమోమని ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్‌ని ఎవరూ నమ్మొద్దంటూ సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

