హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా వాహనదారుల పెండింగ్ చలాన్ల కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మరీ చెల్లించే విధంగా చర్యలు చేపడుతుంటారు. అయితే కొందరు పోలీసులు మాత్రం తమ వాహనాలకు విధించిన జరిమానాలను చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 17,391 కేసుల్లో రూ.68, 67,885 జరినామాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయంపై ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా, సంబంధిత అధికారులు వివరాలు అందించారు. రాష్ట్ర డీజీపీ పేరుతో నమోదైన ఆ వాహనాలు ట్రాఫిక్రూల్స్ పాటించడం లేదని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని ఎక్స్ (ట్విటర్)లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు.