KTR | ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అరెస్ట్ చేశారు. వారిని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి కూడా మేం పోవద్దా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం నెలకొంది. పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరగా వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కేటీఆర్‌ను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు https://t.co/6cnIQkEEZc pic.twitter.com/9Lm6t7Yjm9
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026