BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పీఎస్‌కు తరలిస్తున్నారు.
BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్నారు. రెండు వేర్వేరు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేతలు ఉన్న ఓ వాహనాన్ని కేశంపేట వైపు తరలిస్తున్నారు. మరో వాహనాన్ని షాద్‌నగర్ వైపుగా తరలిస్తున్నారు. నేతలను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యక్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ సీపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
హరీష్ రావు అరెస్ట్.. వీడియోలు#padikaushikreddy #PadiKoushikReddy #HarishRaoThanneeru #HarishRao #KTR #BRS #Congress #RevanthReddy #Hyderabad #Telangana pic.twitter.com/tiym8fzD2B
— Telugu Galaxy (@Telugu_Galaxy) September 12, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

