PM Kisan | కఠినంగా పీఎం కిసాన్ నిబంధనలు.. అనర్హులుగా రిటైర్డ్, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి.
PM Kisan | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల కారణంగా చాలామంది ఈ పథకానికి అనర్హులవుతున్నారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అర్హత పొందినవారికి మాత్రమే ప్రస్తుతం ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. మళ్లీ నాటి నుంచి ఐదేండ్ల వరకు నిబంధనలు మార్చేందుకు అవకాశం లేదు.
ఇలాంటి కఠిన నిబంధనలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి అమలు చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ అమలుకు ఈ నిబంధనలను వీలైనంత మేరకు వర్తింపచేయాలని నిర్ణయించింది. దీంతో రుణమాఫీకి లక్షల మంది అనర్హులయ్యే ప్రమాదం ఏర్పడింది. రిటైర్డ్, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనల వల్ల అత్యధికంగా నష్టపోయే అవకాశం ఉన్నది.
పీఎం కిసాన్‌కు అనర్హులు
- రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారితోపాటు మాజీల కు ఈ పథకం వర్తించదు. మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు ఈ పథకానికి అనర్హులు.
రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ వర్తించదు. - అనర్హుల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే వారు, ప్రభుత్వ ఆధీనంలో ని స్వతంత్ర సంస్థల్లో పని చేసేవారు, స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు ఉన్నారు.
- ఉద్యోగాల్లో రిటైర్డ్ అయి ప్రతి నెల రూ.10 వేల కన్నా ఎక్కువగా పెన్షన్ తీసుకునేవారూ పథకానికి అనర్హులే.
- ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లించేవారు కూడా ఈ పథకానికి అనర్హులు.
- డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్డర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్‌కు పీఎం కిసాన్ వర్తించదు.
- ఎన్ఆర్ఐ కుటుంబాలకు వర్తించదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

