Minister Koppula Eshwar | హరితహారంతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం : మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) పేర్కొన్నారు.
జగిత్యాల : తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్(CM KCR) హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించారని వెల్లడించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బతుకమ్మ కుంట ఫారెస్ట్ నర్సరీలో ఏర్పాటుచేసిన హరితోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. భావితరాలకు స్వచ్ఛమైన , కాలుష్య రహిత హరిత తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం(Haritha Haram) ఒకటని అన్నారు. అందరికీ అందుబాటులో మొక్కలను అందించడం కోసం గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి అందుబాటులోని అనేక రకాల మొక్కలను పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఫారెస్ట్ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

