హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులను తానే చంపేసి.. నేను అనాథను అయ్యానని కొడుకు ఏడుపు ఎత్తుకున్నడట. గట్లున్నది రేవంత్ అండ్ కో అమరవీరులపై చేస్తున్న కొంగజపం. అప్పుడు చావులకు కారణమైన ముఠాలే ఇప్పుడు దండలేస్తామం టూ అంటూ దండెత్తి వస్తున్నాయి. అప్పుడు తెలంగాణ ఊసెత్తితే సహించని బాబు మోచేతి కింద ఉండెటోడు.. ఇప్పుడు మేం ఇచ్చెటోళ్లం కా ము.. తెచ్చేటోళ్లం కామంటూ ఇగిలించి పో రగాళ్ల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పంచలోకి చేరుకొన్నాడు. అలాంటి పార్టీల్లో నాటకాలరాయుడిగా ప్రదర్శనలు ఇస్తున్న రేవంత్.. మలి ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారికి నివాళినీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నడు. అమరుడికిన నివాళి అర్పించడానికి ఇదేనా పద్ధతి?
రేవంత్ నోరు ఎందుకు పెగలలేదు?
శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి నిరుద్యోగ జంగ్ సైరన్‌కు శ్రీకారం చుట్టాలనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని పెడబొబ్బలు పెడుతున్న రేవంత్‌రెడ్డి.. నిజానికి శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నప్పు డు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? తెలంగాణకు అడుగడుగునా ద్రోహంచేసి.. అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే నిషేధించిన దుర్మార్గుడైన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశంలో కాదా? టీడీపీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీయే కదా.. ఆ పార్టీ పన్నిన కుట్ర ల వల్లే కదా తెలంగాణకు అడ్డంకులు వచ్చిపడ్డాయి. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకొన్నప్పుడు రేవంత్ నోరు ఎందుకు పెగలలేదు? ఆనాడు శ్రీకాంతాచారి ఎందుకు ప్రాణత్యాగానికి ఒడిగట్టాడో రేవంత్‌కు కనీసం తెలుసా? . తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడంతో ఆకాంక్షలన్నీ నీరు గారిపోతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో ఆత్మార్పణ చేసుకొన్న త్యాగశీలిని స్మరించడానికైనా రేవంత్‌కు అర్హత ఉన్నదా?
దశాబ్దం తర్వాత అమరజీవి గుర్తొచ్చాడా?
2014లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల బరిలో దిగితే ఆమెపై సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడే పోటీ చేసి ఓడించిన మాట నిజం కాదా? అమరుల కుటుంబాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏపాటిదో చెప్పడానికి ఈ ఒక్క కారణం సరిపోదా? శ్రీకాంతాచారి అమరుడైన నాటినుంచి ఏ ఒక్కనాడైనా ఆ అమరజీవికి కాంగ్రెస్ నేతల్లో ఒక్కరైనా పూలమాల వేసి నివాళులు అర్పించారా?ఇవాళ తగుదునమ్మా అని అమరులను కూడా రేవంత్ తన నీచ రాజకీయ ప్రయోజనాలకు ఉపకరణంగా వాడుకోవడం దుర్మార్గం. శనివారం ఉదయం నుంచి రేవంత్ తన ఇంటి దగ్గర, శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర కార్యకర్తలతో ఆడిన సినిమాటిక్ హై డ్రామా చూసి తెలంగాణ సమాజం ఏవగించుకొంటున్నది. ప్రజలు అసహ్యించుకొంటున్నారు.