ఐరిస్‌తో కరోనా వ్యాప్తి.. హైకోర్టులో పిల్..!

హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుదారుల కంటిపాప (ఐరిస్) స్కానింగ్ చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతున్నదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఐరిస్ స్కానింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. కరోనా వ్యాప్తి నివారణకు ఏమేం చర్యలు చేపట్టారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 22కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
కాలుష్యకారక పరిశ్రమల తరలింపు, మూసివేత
హైదరాబాద్ నగర శివారులోని శాస్త్రిపురం, టాటానగర్ ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమల సమస్యను 80 శాతం వరకు పరిష్కరించామని రాష్ట్ర హైకోర్టుకు జీహెచ్ఎంసీ తెలిపింది. కాలుష్యకారక పరిశ్రమలను వేరే ప్రాంతాలకు తరలించడం లేదా మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మూసేయాలని నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ న్యాయవాది పీ కృష్ణారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది పుష్పేందర్ కౌర్ కూడా హైకోర్టుకు చెప్పారు. మరో 20 శాతం కాలుష్యకారక పరిశ్రమలు బోర్డులు తీసేసి రాత్రిళ్లు నడుపుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం.. రాత్రిళ్లు నడుస్తున్న కాలుష్య పరిశ్రమల వివరాలను నివేదించాలని పిటిషర్‌ను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

