Ghosh Commission | ఘోష్ కమిషన్ నివేదికను సస్పెండ్ చేయండి.. హైకోర్టులో పిటిషన్
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Ghosh Commission | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శైలేంద్రకుమార్ జోషి నీటిపారుదల శాఖలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనాన్ని కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. జూలై 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ప్రభుత్వం సంక్షిప్తం చేయించాక నేరుగా పాలకులు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లో బహిర్గతం చేశారని పిటిషన్లో పేరొన్నారు. ఆగస్టు 4వ తేదీ నాటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ సారాంశాన్ని, వెబ్‌సైట్స్ నుంచి దాని తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలని కూడా విజ్ఞప్తిచేశారు. కమిషన్ తనను సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని, ఈ మేరకు సమన్లు ఇచ్చిందని చెప్పారు. అభియోగాలు చేసే ముందు కమిషన్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. సాక్షిగా విచారణకు పిలిచి నివేదికలో ఆరోపణలు చేయడం హకులను హరించడమేనని చెప్పారు. కమిషన్ నిర్దిష్ట ఆరోపణలు చేసే ముందు క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఆసారం ఇవ్వలేదని తప్పుపట్టారు. ఐఏఎస్ అధికారిగా చేసిన తన వ్యక్తిగత జీవితానికి కళంకం కలిగించేలా కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని తెలిపారు. 1984 నుంచి 31-12-2019న పదవీ విరమణ చేసేవరకు తెలంగాణలో తాను ఎంతో నిజాయితీగా పనిచేసినట్టు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత కీలకమైన ఉన్నత పదవులను సమర్ధంగా నిర్వహించినట్టు వివరించారు. పదవీ విరమణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పేరుతో తనకు అపకీర్తి వచ్చేలా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. తక్షణమే కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ ఆదేశించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

