హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy)పట్టంలోని జీవదాన్ పాఠశాలలో(Jeevadan school) దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అభం, శుభం తెలియని ఆరేండ్ల పాపపై పీఈటీ లైంగికదాడికి(PET misbehaves )యత్నించాడు. యూకేజీ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పాఠశాల వద్ద పాప బంధువులు గొడవకు దిగారు. కీచక ఉపాధ్యాయుడుని అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆరు సంవత్సరాల విద్యార్థిని పై అత్యాచారం చేసిన పీఈటి టీచర్
కామారెడ్డి పట్టంలోని జీవదాన్ పాఠశాలలో UKG విద్యార్థి పై పీఈటి ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పాఠశాల వద్ద గొడవకు దిగిన పాపా బంధువులు.
ఉపాధ్యాయుడుని అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద… pic.twitter.com/WOwhsdRgzY
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2024