Deeksha Divas | దీక్ష దివాస్‌కు అనుమతి నిరాకరణ.. వర్సిటీ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కు 17 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
కంటేశ్వర్ (నిజామాబాద్) : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ ( KCR ) చేపట్టిన దీక్ష దివాస్ (Deeksha Divas) కు 17 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ( Telangana University) గేటు ముందర దీక్ష శిబిరానికి సంబంధించి ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చివేసి, మైక్‌ను తీసివేసి, ప్లెక్సీని చించివేసి దౌర్జాన్యానికి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా బీఅర్ఎస్ సీనియర్ నాయకులు డి.రాజారాం యాదవ్ మాట్లాడుతూ దీక్ష దివాస్ కార్యక్రమం శాంతియుతంగా జరుపుతుంటే మొదట అనుమతి ఇచ్చి, తర్వాత నిరాకరించడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.

2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు కూర్చుంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జైలులో నిర్భందించదని పేర్కొన్నారు. మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్షను కొనసాగించడంతో ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను నేటీ భవిష్యత్ తరాలకు చెప్పటం కోసం ఏర్పాటు చేసుకున్న దీక్ష దివాస్‌కు అనుమతి ఇవ్వక పోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
అప్పటి సమైక్య పాలకులు కూడా ఇలా దౌర్జన్యం చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒత్తిడి వల్ల కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి నిర్బంధాలు విధించిన విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సంతోష్, నాగేంద్ర, నిరంజన్ , బీఅర్ఎస్ నాయకులు కుమార్, లింగం యాదవ్, బొట్టు శ్రీనివాస్ యాదవ్, రాగుల అశోక్ పటేల్, జక్కుల రాజేందర్ యాదవ్, పసులు రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

