పెద్దపల్లి టౌన్, నవంబర్ 16: పెద్దపల్లి కాంగ్రెస్ అభ్య ర్థి విజయరమణారావుపై ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యా దు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారమిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడుతూ విజయరమణారావుకు సింగపూర్, హంకాంగ్, జర్మనీలో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని. అక్కడ పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఈడీ విచారణకుముందే పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.