ఎమ్మెల్సీ బరిలో ఐలు అధ్యక్షుడు కేఎస్
నల్లగొండవరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన (పీడీఎఫ్) అభ్యర్థిగా ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించింది.
- నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ) : నల్లగొండవరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన (పీడీఎఫ్) అభ్యర్థిగా ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు ప్రకటిస్తామని పీడీఎఫ్ వెల్లడించింది. కొల్లి సత్యనారాయణకు సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఈ మేరకు మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన ప్రజా సంఘాల తరఫున కొల్లి సత్యనారాయణను బరిలోకి దించుతూ పీడీఎఫ్‌ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. కొల్లి సత్యనారాయణను ప్రజా సంఘాలు భాగస్వాములై గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు ఉమ్మడి అభ్యర్థిని ప్ర కటించడం రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలకు దారితీస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక రాములు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

