మత్తు మందులు విక్రయిస్తే పీడీ యాక్టు : డిఐజి రంగనాధ్
డిఐజి రంగనాధ్ | జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.

నల్లగొండ : జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.
బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డిఐజి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు.
అందుకు అనుగుణంగా గంజాయిపై గత రెండు నెలలుగా వరుసగా చేస్తున్న దాడుల క్రమంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో గంజాయి రవాణా, విక్రయించాలంటే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్న క్రమంలో సింథటిక్ డ్రగ్స్ వైపుకు యువత ఆకర్షితులవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
అందువల్ల మెడికల్ షాపుల నిర్వాహకులు తరచుగా మత్తు మందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అదే సమయంలో మెడికల్ షాపుల నిర్వాహకులకు రక్షణ కల్పించే విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మత్తు మందుల కారణంగా యువత నిర్వీర్యం అయి దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంలో కీలకమైన యువత భవిష్యత్ మత్తు మందుల బారిన పడి నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయించినా మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయడం, పీడీ యాక్టులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, డ్రగ్ కంట్రోల్ ఏ.డి. శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్ పెక్టర్ వరప్రసాద్, కెమిస్ట్ అసోసియేషన్ నాయకులు సిరిప్రోలు వెంకటపతి, జి. వెంకటేశ్వర్లు, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మధు, సురేష్ కుమార్, రాఘవులు సత్యనారాయణ, నాగరాజు, నిగిడాల సురేష్, శంకర్ రెడ్డి, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, నర్సింహులు, నాగరాజు, యాదయ్య తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

