Part time Lecturers | సచివాలయం వద్ద ఉద్రిక్తత.. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పార్ట్‌టైం అధ్యాపకుల ఆందోళన
సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్‌టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్‌ను ముట్టడించారు.
హైదరాబాద్: సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్‌టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్ట్‌టైం లెక్చరర్లకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం వారిని వానుల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో 900 మంది పార్ట్‌టైం అధ్యాపకులు ఉన్నారని, జీవో 21 ప్రకారం రెగ్యులర్ అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తే తమ ఉద్యోగాలు పోతాయన్నారు. దీంతో తమ కుటుంబాలు రోడ్డుపాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధ్యాపక నియామకాల్లో పార్ట్‌టైం అధ్యాపకులకు ప్రథమ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. జీవో 21కి వ్యతిరేకంగా పార్ట్ టైమ్ అధ్యాపకులు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

