కనీవినీ ఎరుగని చిలుక ముక్కు చేప ఒకటి వలకు చిక్కింది. తల పక్షి ఆకారంలో ఉండగా, శరీరం మాత్రం చేపలా ఉన్నది. ఈ వింత చేప మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల పెద్దచెరువులో మత్స్యకారులకు దొరికింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు చేపను చూసేందుకు తరలివచ్చారు. ఇలాంటి చేపను చూడ టం ఇదే తొలిసారని మత్స్యకారులు పిట్టల వెంకన్న, ఉపేందర్, చెన్నబోయిన వీరన్న తెలిపారు.