ప్రగతి సంబురం

ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు
పల్లె, పట్టణ ప్రగతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య పనులు, శిథిల భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఏడో రోజైన బుధవారం మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ప్రగతి పనుల్లో పాల్గొన్నారు.
శభాష్ మడక..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామాన్ని స్వచ్ఛభారత్ రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. బుధవారం ఉదయం కాలినడకన ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్, డంప్‌యార్డు, వన నర్సరీ, గుట్టల్లో పెంచుతున్న జామతోటలను పరిశీలించారు. అధికారులు సురేశ్‌బాబు, ఎస్బీఐ ఐఈసీ నిపుణుడు శ్యాంకుమార్ దళితకాలనీలో ఓ ఇంటిలో విరగగాసిన జామచెట్టు వద్దకు వెళ్లి పండ్లను రుచిచూశారు. గ్రామంలో చేపట్టిన ప్రగతి పనులు బాగున్నాయని పాలకవర్గాన్ని అభినందించింది. – ఓదెల
తెలంగాణ పథకాలు ఆదర్శం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవితో కలిసి బుధవారం మొక్కలు నాటారు. – శామీర్‌పేట
నిబద్ధతకు ప్రతిరూపం కేసీఆర్
పల్లె ప్రగతి ద్వారా సీఎం కేసీఆర్ నిబద్ధతతో ఊళ్లను బాగు చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని కిష్టంపేట, వెంకట్రావుపేట పల్లె ప్రకృతి వనాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. – మంచిర్యాల, నమస్తే తెలంగాణ
రాష్ట్రం హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో టీజీవో సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. – మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ
హరితహారంలో అందరూ పాల్గొనాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నూనావత్ తం డాలో మెగా హరితహారం లో ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
– మిర్యాలగూడ రూరల్
హరిత ఫలం!
పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల ఫలితాలు రావడంపై ఎంపీ సంతోష్‌కుమార్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో.. నేలకు మూడడుగుల ఎత్తైనా పెరగని చిట్టి జామచెట్టు విరగకాసిన చిత్రా న్ని పోస్ట్‌చేశారు. ‘ఎంత అం దంగా ఉన్నాయి ఈ జామకాయలు.. రంగారెడ్డి జిల్లా చేవె ళ్ల మండలం దేవునిరావల్లిలో పల్లె ప్రగతిలో భాగంగా నాటి న జామచెట్టు అందిస్తున్న ఫలాలివి’ అని పేర్కొన్నారు.
ఆరుగురు కార్యదర్శుల సస్పెన్షన్
ఇందూరు, జూలై 7: పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన నందిపేట్ మం డలం అయిలాపూర్, వర్ని మండలం వకీల్‌ఫారం, డిచ్పల్లి మండలం సాంపల్లి, సుద్దపల్లి, ధర్పల్లి మండలం రామడ్గు, ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామాల కార్యదర్శులను నిజామాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

