జనగామ, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎంజీఎంహెచ్ సందర్శనకు వెళ్లిన దాస్యం వినయ్భాసర్పై పోలీసులు వ్యవహరించిన తీరును జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎంజీఎంలో బెడ్లు, అంబులెన్స్‌ల కొరత, పైకప్పు పెచ్చులూడుతున్న దుస్థితిపై ప్రశ్నించిన ప్రజాప్రతినిధిని అడ్డుకొని దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకు కడుపులో తన్నడం, గాయపర్చడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన? అని ఆయ న ప్రశ్నించారు. ఆసుపత్రుల పరిస్థితులను చకదిద్దాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పోలీసుల అత్యుత్సాహాన్ని వెంటనే అరికట్టి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.