Palamuru University | కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్
పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహించడంలేదు.
Palamuru University | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహించడంలేదు.
ఇలా ఇంజినీరింగ్ కోర్సుల్లేని వర్సిటీకి, సాంకేతిక విద్య ప్రొఫెసర్‌ను వీసీగా నియమించడమేంటన్న అభ్యంతరాలొస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కీలకమైన జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్ నియామకాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. తాజాగా 9 వర్సిటీలకు వీసీలను నియమించగా, జేఎన్టీయూకు మాత్రం వీసీని నియమించలేదు. అయితే ఈ వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ సిఫారసులను ప్రభుత్వం పక్కనపెట్టినట్టు తెలిసింది.
జేఎన్టీయూతోపాటు బీఆర్ అంబేద్కర్, జేఏఎన్ఎఫ్ఏయూలకు వీసీలను నియమించాల్సి ఉంది. వీసీల ని యామకంలో సామాజిక సమతూకంలో పించిందన్న ఆరోపణలొస్తున్నాయి. ఎస్టీలో ఆదివాసీ, ఎస్సీలో మాల సామాజికవర్గాలకు చోటు కల్పించలేదు. తాజా వీసీల్లో ముగ్గురు బీసీలు, ఇద్దరు రెడ్డి, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీలకు చోటు కల్పించింది. మహిళా వర్సిటీ ఇన్చార్జీ వీసీగా ఎస్టీ లంబాడా, ఆర్జీయూకేటీ ఇన్చార్జీ వీసీగా ఎస్సీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

