భళా బాహుబలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1 వద్ద రెండు మోటర్ల నుంచి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నాగర్ర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి.
- రెండు మోటర్ల ద్వారా ప్రవాహంలా ఎత్తిపోత ఇది కేసీఆర్ పాలనకు మార్క్
కొల్లాపూర్, అక్టోబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1 వద్ద రెండు మోటర్ల నుంచి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నాగర్ర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఒక్కో మోటర్ 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు బాహుబలి మోటర్లు ఆన్ చేస్తేనే.. డెలివరీ సిస్టర్న్ నుం చి జలాలు ఉప్పొంగి.. నదీ ప్రవాహాన్ని తలపి స్తూ నార్లాపూర్ రిజర్వాయర్లోకి చేరుతున్నా యి. కృష్ణానీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తుకు పంపులు నీటిని ఎత్తిపోస్తున్నాయి.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా బాహుబలి మోటర్లకు అంకురార్పణ చేసి.. నది అడుగు భాగంలో కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణం పూర్తయిన పీఆర్ఎల్ఐని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై వివక్ష చూ పుతూ నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం మరుగున పెట్టేందుకు యత్నించినా నేడు కరు వు నుంచి తప్పించేకునేందు కు ఇదే లిఫ్ట్ పంపింగ్ శరణ్యమైం ది. ఇదంతా కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం.
బాహుబలి మోటర్ల నుంచి..
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించేందుకు.. శ్రీశైలం జలాశయం లో 244 మీటర్ల నుంచి 60 రోజులపాటు 90 టీఎంసీలను ఎత్తిపోసే విధంగా పీఆర్ఎల్ఐని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసి పూర్తిచేశారు. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకానికి అంతే భారీ సామర్థ్యం కలిగిన 145 మెగావాట్స్ (స్టాండ్బైతో కలిపి) తొమ్మిది మోటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్ 3వేల క్యూసెక్కులు ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉండటం కూడా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐ మొదటి పంప్ ఆన్చేయడంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు పరుగులు పెట్టాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్లను ఆన్ చేయలేదు. బీఆర్ఎస్ ఒత్తిడితో రెండ్రోజుల కిందట లిఫ్ట్-1లోని రెండు పంపులను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు ఆన్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి 9:30 గంటల నుంచి బాహుబలి మోటర్లు నీటిని పంపింగ్ చేస్తున్నాయి. ఉప్పొంగుతున్న నీటిని చూసిన రైతులు భళా బాహుబలి అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

