నిలిచిన పీఆర్ఎల్ఐ ప్యాకేజీ-3 పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టాలనే ఆలోచనలో ఉన్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుపై మొదటి నుంచీ కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నది.
- నిర్వాసితుల అభ్యంతరాల వెనుక అధికార పార్టీ నేతల హస్తం?
- పనులను అడ్డుకునేది వారే!
- సర్కార్‌కు కావాల్సింది కూడా అదే!
కొల్లాపూర్, నవంబర్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టాలనే ఆలోచనలో ఉన్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుపై మొదటి నుంచీ కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నది. పంపులు ఆన్ చేయాలని.. లేదంటే రైతులతో కలిసి ముట్టడించి మోటర్లను ఆన్ చేస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో సర్కార్‌లో కదలిక వచ్చి.. మోటర్లు ఆన్ చేసినా పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోయకముందే బంద్ పెట్టింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించినా లాభం లేదు.
మూడో ప్యాకేజీ పనులు గురువారం మళ్లా నిలిచిపోయాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఈ ప్రధాన కాలువ పనుల్లో కేవలం నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదు. డిసెంబర్‌లోగా ప్యాకేజీ పనులను పూర్తి చేసి ఏదుల రిజర్వాయర్ వరకు నీటిని తీసుకెళ్తామని ప్రగల్భాలు పలికిన స్థానిక మంత్రి అనుచరులే రెండో ప్యాకేజీ నిర్వాసితులతో కలిసి మూడో ప్యాకేజీ పనులను అడ్డుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వం పరిహారం సాకుతో పాలమూరు పనులను నిలిపివేసే అవకాశం దొరికినట్టయిందని రైతులు భావిస్తున్నారు.
గత నెలలో పనులను అడ్డుకొన్న మంత్రి అనుచరులు
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో గతనెల 17న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన కంపెనీ చేపట్టిన పీఆర్ఎల్ఐ ప్యాకేజీ-2లో నిర్వాసితులమని, పరిహారం ఇంకా కొందరికి రాలేదని సదరు గ్రామ అధికార పార్టీ సర్పంచ్, మరికొందరు కలిసి ప్యాకేజీ-3లో జరుగుతున్న పనులను అడ్డగించారు. వీరే ఇటీవల సున్నపుతండా వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సైతం అడ్డుకున్నారు. అయితే సంబంధంలేని మూడో ప్యాకేజీ పనుల అడ్డగింతలో అధికార పార్టీ నాయకుల మర్మం దాగి ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

