Oxytocin Injections | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, సలాల కొత్తపేట్, బాలాపూర్‌కు చెందిన సలామ్-బిన్-మహ్మద్ మిస్త్రీ మనుషులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు సరఫరా చేస్తున్నాడు. సమాచారం మేరకు డీసీఏ అధికారులు, పోలీసులు నిందితుడు మహమ్మద్ మిస్త్రీ ఇంటిపై దాడి చేసి, అక్రమంగా నిల్వ ఉన్న లేబుల్స్ లేని 50 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు.
కాగా, ‘మెరోజ్ఫోర్డ్’ 1గ్రాము అనే యాంటిబయోటిక్ ఇంజెక్షన్లను ఎంఆర్పీ (రూ.1067)కంటే అధిక ధర(రూ.3,390)లకు విక్రయిస్తున్న వరంగల్‌లోని ఒర్లిఫోర్డ్ హెల్త్‌కేర్ అనే ఔషధ విక్రయ కేంద్రంపై డీసీఏ అధికారులు దాడులు చేశారు. రూ.13,650 విలువైన ఔషధాలను సీజ్ చేశారు. అదేవిధంగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్, సుచిత్ర వద్ద ఉన్న మహానగర్ ఎస్టేట్‌కు చెందిన బొడసు రామానుజం ఇంటి నుంచి రూ.23.10 లక్షల విలువ చేసే ఔషధాలను సీజ్ చేశారు.