హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్నది. 13.2 శాతం కార్లు, క్యాబ్‌లు, 3.1 శాతం ఆటో రిక్షాలు, ఇతర వాహనాలు 9.5 శాతం ఉన్నాయని వెల్లడించింది.