ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 11: ఓయూ సైన్స్ కళాశాల జెనెటిక్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ రోజారాణి అరుదైన ఘనత సొంతం చేసుకొన్నారు. రెండు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె పాల్గొననున్నారు. లండన్లో మే 2, 3న నిర్వహించే వరల్డ్ కాంగ్రెస్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్లో ‘ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ థెరపీస్’ అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారు.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జూలై 19,20న నిర్వహించే ‘వరల్డ్ కాంగ్రెస్ ఆన్ క్యాన్సర్ రిసెర్చ్ అండ్ థెరపీ’లో ‘నావెల్ డిస్కవరీస్ ఇన్ క్యాన్సర్ రిసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ’ అనే అంశంపై ఉపన్యాసం ఇస్తారు. గతంలో ఈమె అమెరికాలోని ఓ పరిశోధన సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా రోజారాణిని పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు అభినందించారు.