‘ఔట్సోర్సింగ్’ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి
: రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి
హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మధుసూదనాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మధుసూదనాచారి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు సత్వరమే చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, చికుడు ప్రభాకర్, పృథ్వీరాజ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

