Bhadradri | ఆన్లైన్లో శ్రీరామనవమి, పట్టాభిషేకం టికెట్లు
భద్రాచలం, మార్చి 2 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేకం వేడుకలు ఉంటాయని వివరించారు.
ఈ ఉత్సవాలను వీక్షించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువ గల సెక్టార్ టికెట్లను, పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల సెక్టార్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
ఆసక్తి గల భక్తులు స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం టికెట్లను www.bhadrachalamonline.com ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే రూ.7,500 శ్రీరామనవమి ఉభయ దాతల టికెట్లు కార్యాలయంలోని ఆలయ టికెట్ల కౌంటర్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. టికెట్లు కావాల్సిన భక్తులు దేవస్థానం కార్యాలయం పనివేళల్లో 08743-232428 నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

