పందెంకోడి లక్ష!

- ఏపీలో సంక్రాంతి సందర్భంగా రేట్లకు రెక్కలు
హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): సంక్రాంతి మందు ఏపీలో కోడిపుంజుల ధరలు అమాంతం పెరిగాయి. పందెం బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు బంగారం రేట్లను తలపిస్తున్నాయి. రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. పందెంకోళ్లలో సేతువ జాతిది అగ్రస్థానం. దీన్ని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నది. తర్వాత స్థానాల్లో పర్ల, నెమలి, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి. పర్ల రూ.50 వేలు, నెమలి రూ.50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.25 నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకిడేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితోపాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటాయని పెంపకందారులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రకటించారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

