రూ.15 లక్షలు పలికిన TS 09 FY 9999
Fancy Numbers | మార్కెట్లోకి ఏదైనా సరికొత్త వాహనం వచ్చిందంటే చాలు కొనేందుకు రెడీగా ఉంటారు కొందరు వాహన ప్రియులు. అంతే కాదండోయ్.. చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్న బ్రాండెడ్ వాహనానికి.. ఫ్యాన్సీ
హైదరాబాద్ : మార్కెట్లోకి ఏదైనా సరికొత్త వాహనం వచ్చిందంటే చాలు కొనేందుకు రెడీగా ఉంటారు కొందరు వాహన ప్రియులు. అంతే కాదండోయ్.. చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్న బ్రాండెడ్ వాహనానికి.. ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవాలని ఆరాట పడుతుంటారు. ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే వాహనం కొనుగోలు ధర కంటే ఎక్కువ ఖర్చు ఫ్యాన్సీ నంబర్లకు పెడుతుంటారు.
ఈ క్రమంలో ఆన్లైన్ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకునేందుకు వాహనదారులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. స్పెషల్ రిజర్వేషన్ నెంబర్లను కైవసం చేసుకునేందుకు పోటీ పడుతారు.
తాజాగా మంగళవారం ఆర్టీఏ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో రూ. లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకున్నారు. TS 09 FY 9999 నంబర్‌ను రూ. 15 లక్షలకు అదిత్య బ్రాడ్ కాస్టింగ్ సంస్థ దక్కించుకోగా, TS 09 FZ 0099 నంబర్‌ను రూ. 6.31 లక్షలకు సుశీఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్, TS 09 FZ 0001 నంబర్‌ను సౌమ్య చలసాని రూ.5.50లక్షలకు, TS 09 FZ 0007 నంబర్‌ను దీక్షిత్ స్వాతి రూ.2.45 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తంగా మంగళవారం ఒక్కరోజే ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఆర్టీఏ ఖజానాలో రూ. 47.52 లక్షల ఆదాయం జమ అయింది. ఈమేరకు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండు రంగ్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

