Onion Price | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి, ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లలో కిలో రూ.60-రూ.70కి విక్రయిస్తున్నారు. దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.
15 రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% తగ్గాయని అంటున్నారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.