Srsp Project | ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
Srsp Project | జిల్లాలోని ఎస్సారెస్పీ నుంచి దిగువ గోదావరిలోకి 22,720 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు.

నిజామాబాద్ : జిల్లాలోని ఎస్సారెస్పీ నుంచి దిగువ గోదావరిలోకి 22,720 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ఉధృతి పెరగడంతో 20 వరద గేట్లను ఎత్తి 74,880 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశామని పేర్కొన్నారు.
సాయంత్రానికి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 5 గంటలకు 14 గేట్లను మూసివేసి 6 గేట్లతో 18,720 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 4 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కాలువకు మధ్యాహ్నం నీటి విడుదలను 3500 క్యూసెక్కులకు పెంచినట్లు తెలిపారు.
సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదలను ప్రారంభించామన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1090.90 అడుగుల( 89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 292.116 టీఎంసీల వరద వచ్చిందన్నారు. కాలువలు, గోదావరిలోకి 220 టీఎంసీల మిగుల జలాలను వదిలినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్‌లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లేనా..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

