Congress | ఒకటో తారీఖు జీతం ప్రచార ఆర్భాటమే.. సెర్ప్ ఉద్యోగులకు రెండు నెలలుగా అందని వేతనాలు
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న ఒకటో తారీఖు వేతనం ప్రచార ఆర్భాటంగానే నిలిచింది. ఒకటో తారీఖు దేవుడెరుగు కనీసం నెల గడిచినా కూడా జీతం అందడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Congress | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న ఒకటో తారీఖు వేతనం ప్రచార ఆర్భాటంగానే నిలిచింది. ఒకటో తారీఖు దేవుడెరుగు కనీసం నెల గడిచినా కూడా జీతం అందడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ చెప్పిన మాటలకు ఆచరణకు ఏ మాత్రం పొంతన లేదని, ఇది మాటల ప్రభుత్వంగా మారిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. రాష్ట్రంలో దాదాపుగా 4500 మంది సెర్ప్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలను ఏప్రిల్ మొదటి వారం వచ్చినా ఇంతవరకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతినెల వేతనాలు వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఇప్పటి వరకు రెండు నెలలు జీతాలు ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వేతనాలతో పనిచేసే తమకు నెలవారీ ఖర్చులకు డబ్బులకు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి అమలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా చేయడంలో సెర్ప్ ఉద్యోగులది కీలక పాత్ర. అయినా కనీసం వేతనాలకు నోచుకోలేకపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెల ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నదని, భవిష్యత్తులో పిల్లలకు, ఇంటి అవసరాలకు రుణాలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, సంఘాల నాయకులు ఉన్నతాధికారులను ఎన్నిసార్లు అడిగినా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారని ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారుల వల్లనే జీతాలు ఆలస్యం అవుతున్నాయని సెర్ప్ అధికారులు, సెర్ప్ అధికారుల వల్లనే అని ఆర్థిక శాఖ అధికారులు కారణంగా చూపుతున్నారని సమాచారం. సెర్ప్ ఉద్యోగులందరికీ ఈ-కుబేర్ ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారని, అయితే ఈ ప్రక్రియ నాలుగైదు నెలలుగా సాగుతున్నదని, ఇంత వరకు పూర్తి కాలేదని దీంతో వేతనాలు సకాలంలో రావడంలేదని సమాచారం. తమ సమస్యను పరిష్కరించి వేతనాలు నెలనెలా అందేవిధంగా చూడాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

