TS Assembly Elections 2023 | ఓటు వేసి తిరిగివెళుతూ అనంతలోకాలకు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.
సిద్ధిపేట : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. స్దానికులు స్వామిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు.
హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి ఓటు వేసేందుకు సిద్ధిపేట వచ్చి మృత్యువాతన పడటంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్ధతకు గురై మరణించారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ అనే వృద్ధురాలు (76) పోలింగ్ కేంద్రానికి చేరుకునేలోగా ఫిట్స్‌తో పడిపోయింది.
దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఇక భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నాడు. ఆపై కండ్లు తిరిగి పడిపోవడంతో ఆయనను కూడా రిమ్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజన్న ప్రాణాలు కోల్పోయారు.
Read More :
Assembly Elections | జంటనగరాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

