స్వయం సమృద్ధిలో ఏపూర్ అద్భుతం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.
- ఉత్తరప్రదేశ్ బృందం సభ్యుల కితాబు
ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 12: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది. జాతీయస్థాయిలో మహిళా విభాగంలో ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకున్న ఏపూ ర్ గ్రామాన్ని యూపీ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది.
ఈ సందర్భంగా మహిళా విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి ఏ విధంగా కృషి చేశారని పాలకవర్గాన్ని బృందం అడిగి తెలుసుకున్నది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో మహిళల కోసం చేసిన అభివృద్ధి పనులను, మహిళలు ఆర్థికంగా ఎలా స్వయం సమృద్ధి సాధించారో వారికి వివరించారు.
సంతులిత గ్రామీణాభివృద్ధిలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, మహిళల ఆరోగ్యం, రాజకీయ అవగాహన తదితర కార్యక్రమాలపై మహిళలకు గ్రామ పంచాయతీ ద్వారా అవకాశాలు కల్పించామని తెలిపారు. అనంతరం గ్రామ వీధుల్లో తిరుగుతూ గ్రామంలోని మహిళా పార్క్, అంగన్వాడీ సెంటర్, మహిళా వ్యాయామశాల, చిల్డ్రన్స్ పార్క్, హెల్త్ సబ్‌సెంటర్, వైకుంఠధామం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ చూసి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. గ్రామ పంచాయతీ నర్సరీ, ఏటా ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ గురించి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

