MLC Kavitha | ఆక్స్‌ఫర్డ్‌లో ‘తెలంగాణ మాడల్’.. వర్సిటీలో కీలకోపన్యానం ఇవ్వనున్న ఎమ్మెల్సీ కవిత
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోమవారం ఆమె ఆక్స్ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.
- ఆ వర్సిటీలో నేడు కీలకోపన్యానం ఇవ్వనున్న ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిపై ప్రజెంటేషన్
- కవితకు ఘనంగా వీడోలు పలికిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
MLC Kavitha | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోమవారం ఆమె ఆక్స్ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. ‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌క్లూసివ్ డెవలప్మెంట్-ది తెలంగాణ మాడల్’ అనే అంశంపై ఈ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కవితను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఇందుకోసం బ్రిటన్‌కు బయలుదేరిన కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో వీడోలు పలికారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై ఆవిషరించే అవకాశాన్ని పొందినందుకు కవితను అభినందించారు. తెలంగాణ ఘనతను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పడం రాష్ర్టానికి గర్వకారణమని కొనియాడారు.
ప్రజెంటేషన్ ఇవ్వనున్న కవిత
పదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కా ర్యక్రమాలు ఆక్స్ఫర్డ్ వర్సిటీని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాడల్‌పై కీలకోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఆ వర్సిటీ ఆహ్వానించింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళ ప్రయోజనకర పథకాల రూపకల్పనపై ఆమె వివరించనున్నారు. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమించిన తీరు, రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తుండటం, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా, కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మత్తు చేయడం, విద్య, వైద్యం, మౌలిక వసతులు సహా పలు ఇతర రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి ఆమె ప్రత్యేకంగా వివరిస్తారు.
ఇది కరెక్టే కదా.. అన్నయ్య ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్సీ కవిత.. ఎక్స్(ట్విట్టర్)లో ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌తో చిన్నప్పుడు దిగిన ఫొటోను బీఆర్ఎస్ నాయకుడు అర్వింద్ అలిశెట్టి పోస్ట్ చేయగా, కవిత దానికి స్పందించారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ, ‘అతను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. కేటీఆర్‌తో అనేక మధురానుభూతులు ఉన్నాయి. వాటిని వర్ణించలేము. ఇది కరెక్టే కదా అన్నయ్య’ అని ట్వీట్ చేస్తూ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

