Prajavani | నేను బతికేఉన్న.. సచ్చిపోయినానని అంటున్నది ఈ సర్కారు.. ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన
‘నేను బతికే ఉన్న. పింఛన్ ఇవ్వండి సారూ’ అంటూ ఓ వృద్ధురాలు ఎక్కని మెట్లు, కలవని అధికారి లేడు.
- అందుకే పింఛన్ ఇస్తలేదు
- కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండు
- నాకు పింఛన్ ఇచ్చేందుకూ వీళ్లకు చేతులొస్తలేవు!
- ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన
Prajavani | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 ( నమస్తే తెలంగాణ ) : ‘నేను బతికే ఉన్న. పింఛన్ ఇవ్వండి సారూ’ అంటూ ఓ వృద్ధురాలు ఎక్కని మెట్లు, కలవని అధికారి లేడు. అధికారులు కనికరించకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చింది. ఖైరతాబాద్ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే రుక్నమ్మకు 59 ఏండ్లు. భర్త చనిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది.
పింఛన్ మంజూరు కోసం తహసీల్దార్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైందని, ఇప్పుడు మాత్రం పింఛనూ ఇస్తలేరని ఆవేదన వ్యక్తంచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

